Tuesday 4 December 2012

కపిలేశ్వరపురం శ్రీ అగస్త్యేశ్వరస్వామి


                                    
           Kapileswarapuram  Sri Agasetwaraswamy Darsanam.



                          కపిలేశ్వరపురం శ్రీ అగస్త్యేశ్వర స్వామి దర్శనం.
                             
         
        कपिलेश्वरपुरं श्री अगस्त्येश्वरस्वामि दर्शनम्.



                          కృష్ణాతీరం లో  కొలువు తీరిన శైవ క్షేత్రాల్లో కపిలేశ్వరపురం ఒకటి.  కపిలమహర్షి తపస్సు చేసి, ఈశ్వరుని దర్శించిన పుణ్యస్ధలి గా కపిలేశ్వరపురం చెప్పబడుతోంది.

                   
                       ఆలయ ముఖద్వారం  

      స్ధలపురాణం.:-----         కృష్ణాతీరం లో అగస్త్య ప్రతిష్ఠితమైన శివలింగాల్లో   కపిలేశ్వరస్వామి కూడ ఒకరు. అగస్త్యునిచే ప్రతిష్టించబడుట వలన ఈయన  అగస్త్యేశ్వరస్వామి  గా పిలువబడుతున్నాడు. స్వామి వారి ప్రతిష్ఠ త్రేతాయుగం లోనే అగస్త్యమహర్షి చేసినట్లు పురాణ కథనం. ఆలయ నిర్మాణం చోళరాజుల కాలం లోని దని చరిత్ర కారులు అబిప్రాయపడ్డారు.
                  
                      ఆనాటి కరపత్రం  మొదటి పేజి
           
           క్రీ.శ 1927  సం.జూన్ నెల నాల్గవ తేదీనుండి ది. 8.6.27 తేదీవరకు పాంచాహ్నిక దీక్ష తో ముళ్లపూడి పేర్రాజు అనే ఆస్తిక మహోదయుల పర్యవేక్షణ లో ఆలయ పున: ప్రతిష్టా కార్యక్రమాలు జరిగి నట్లుగా ఆలయం లో అర్చకస్వాములచే లామినేషన్ చేయించి భద్రపరుప బడిన  ఆనాటి కరపత్రము చే తెలుస్తున్నది.
                             
                                 కరపత్రం రెండోపేజి
              
                ఆలయం లో స్వామివారి కిరువైపులా ఉపాలయాల్లో  స్వామి కి ఎడమవైపున రాజరాజేశ్వరీ దేవి,కుడివైపున వీరభద్రేశ్వరుడు,భద్రకాళి కొలువు తీరి ఉన్నారు. ముఖమండప సమీపం లోని ఉపాలయం లో  దేవసేన, వల్లీ సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి  వేంచేసి, భక్తులను  కటాక్షిస్తున్నారు.
                               
                           ఆలయప్రాంగణం లోని ఒక శిథిల శిల్పం
        
                     ఆలయం లో స్వామి వారి ఉత్తర ద్వారానికి అబిముఖంగా, మారేడు చెట్ల మధ్య ఒక శివలింగము నందీశ్వరుడు  ఛూడముచ్చట గా కొలువు తీరి ఉన్నారు. ఆ ప్రక్కనే చోళ సంప్రదాయం ఒలక పోస్తున్న కొన్ని శిథిల శిల్పాలు కన్పిస్తాయి.
                        
                    మారేడు చెట్ల మధ్య లో శివమూర్తి, నందీశ్వరుడు
                     

            ఈ ఆలయానికి  అభిముఖంగా కొంచెం ఆగ్నేయంగా పడమర కు తిరిగి శ్రీ రఘునాయకస్వామి  వారి ఆలయం  దర్శనమిస్తుంది. ఇది కూడ చాల ప్రాచీన ఆలయమే. సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రుడు చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తాడు.
                               
                              
                         రఘునాయకస్వామి  ఆలయ ముఖద్వారం

రవాణాసౌకర్యాలు.:------                మంటాడ నుంచి వయా కపిలేశ్వరపురం మీదుగా వీరంకిలాకు ఆర్టీసీ సర్వీసులున్నాయి.మంటాడ నుండి ఆటోల సౌకర్యం కూడ  పుష్కలంగా ఉంది.


                                     ఆలయ  దృశ్యం



*****************************************************  ***************************       

No comments:

Post a Comment