Sunday, 22 September 2013

హేలాపురి ( ఏలూరు ) శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం


          Helapuri ( ELURU ) Sri  Chennakesava Swamy  Aalayam.       
            
                        హేలాపురి (  ఏలూరు ) శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం.
                
                 हेलापुरि ( एलूरु ) श्रीचॆन्नकेशवस्वामि आलयम्.
         
              పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శనివారపుపేట గ్రామం లో వెలసిన   శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం 200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలది. సుమారు వంద అడుగుల  ఎత్తుగల  ఈ ఆలయ గాలిగోపురం ఈ ఆలయ ప్రాశస్త్యానికి ప్రథాన కారణం గా  చెప్పవచ్చు. చిన్న తిరుపతి గా పిలువబడుతున్న ద్వారకా తిరుమల దేవస్థానం చేత దత్తత తీసుకొనబడిన ఈ ఆలయం నూజివీడు జమీందారుల కాలం లో నిర్మించబడినట్లు  చరిత్ర చెపుతోంది.
                 

     

              నూజివీడు జమీందారులలో ప్రఖ్యాతి గాంచిన శ్రీ రాజా మేకాధర్మఅప్పారావు గారి వంశంలో సుమారు రెండు వందల సంవత్సరాలక్రితం రాజా మేకా అప్పారావు జమీందారు గారు ఈ శనివారపుపేట వచ్చిఇ క్కడ దివాణము ఏర్పాటు చేసుకొని స్థిరపడినట్లు చరిత్ర చెపుతోంది. 




ఆ సమయం లో శ్రీ చెన్నకేశవ స్వామి వారు శ్రీ రాజావారికి కలలో కన్పించి బావిలో శ్రీ చెన్నకేశవస్వామి విగ్రహ మున్నదని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి, ఆలయాన్ని నిర్మించి, విగ్రహప్రతిష్ఠ చేయవలసిందిగా ఆదేశించారు.

                
                 ధైవాజ్ఞ ను శిరసావహించి శ్రీ రాజావారు ఆవిగ్రహాన్ని వెలికి తీయించి, ఆలయాన్ని నిర్మింపచేసి, శ్రీ వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠాది కార్యక్రమాలు చేయించి, నిత్యపూజలకు, ఉత్సవాలకు  సాధన సంపత్తిని ఏర్పాటు చేశారు.
                                  


                    ఆలయ ముఖమండప దృశ్యం
  
   కాలక్రమం లో శ్రీ అప్పారావు వంశం లోని శ్రీ ధర్మాఅప్పారావు గారి కోడళ్లు గా వచ్చిన శ్రీ రాణీ చెన్నమ్మారావు బహద్దర్ వారు, శ్రీ రాణీ పాపమ్మారావు బహద్దర్ వారు ఈ దేవాలయ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సుమారు వంద అడుగుల  ఎత్తు గల గాలిగోపురాన్ని  అద్భుతమైన శిల్పకళావైభంవంతో నిర్మింపచేశారు. నేటికీ ఈ గోపురం అలనాటి చరిత్రలకు గుర్తుగా నిలిచి ఉంది.
                                  
  
                      
                      శ్రీ చెన్నకేశవుని దివ్యమంగళ విగ్రహం
           
                    ఈ గోపురం నాలుగువైపులా రామాయణ ,భారత, భాగవతాదిపురాణ గాథలే కాకుండా ఆనాటి రాజుల దండయాత్రా విశేష శిల్పాలు, అనేక జానపద,శృంగార భంగిమలు  చూపరులను ఆకట్టుకుంటాయి.






                         
 శ్రీ రాజ్యలక్ష్మీ దేవి                                                   శ్రీ గోదాదేవి

           అయితే ఇదే సమయంలో ఈ గోపురం పై చెట్లు మొలిచి, సంస్కార దూరమై శిథిలావస్థ కు చేరుకోవడం కూడ బాధాకరమైన విషయమే.



                                                              గోపురం పై   పిచ్చిమొక్కలు
           .


                  
                               శ్రీ ఆంజనేయుని మంగళ విగ్రహం
        
        ఇంత గొప్పచరిత్ర కల్గిన ఈ ఆలయాన్ని  సంరక్షించాలనే సత్సంకల్పంతో ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తలు మైలవరం జమీందారులు ఐన శ్రీ సూరానేనివెంకట సుధాకరరావు  బహద్దర్ వారి నేతృత్వంలో ఈ ఆలయాన్నిద్వారకా తిరుమల ఆలయానికి దత్తత తీసుకొని, శ్రీస్వామివారికి నిత్యోత్సవ, పక్షోక్షవ,మాసోత్సవ,సంవత్సరోత్సవాది ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేటట్లు ఏర్పాటుచేయఢమే కాకుండా గాలిగోపుర రక్షణకు కూడ పూనుకోవడం అభినందించదగ్గ విషయం.
                                ఈ ఆలయ ప్రాంగణం లోనే ఒక పెద్దకోనేరు ఉంది.ఉత్తరాభిముఖం గా ఉన్న ఆలయానికి ఎడమవైపు ఆంజనేయుని మందిరం  ఒకటి కనిపిస్తుంది.
                           
           

                                         శ్రీ గణపతి
                
       దానికి కొద్ది ఎడంగా  గణపతి,  పార్వతీసమేత రామలింగేశ్వర ఆలయాలు కూడ ఇదే ప్రాంగణం లో నిర్మింపబడి,  శివకేశవాభేదాన్ని ప్రకటిస్తున్నాయి.
                 
        



                            శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరుడు

                  ఏలూరు నుండి నూజివీడు వెళ్లే మార్గం లో ఈ ఆలయం దర్శనమిస్తుంది.


                                    
                                శ్రీ వేంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహం
          
  ఈ ఆలయానికి తూర్పుగా కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వరుని దివ్యాలయం ఒకటి ఆథునిక నిర్మాణంగా వెలసి.భక్తుల సేవలందుకొంటొంది.


                                  శ్రీవారి పాదాలు 

 visit us on you tube www. raviprasadmuttevi 





 **************************************************************


  

No comments:

Post a Comment